Sunday, August 1, 2021
✝ *నిజమైన స్నేహితుడు*👬
_(యోహా 15:14 నేను మీ కాజ్ఞాపించువాటిని చేసిన యెడల, మీరు *నా స్నేహితులై* యుందురు.)_
✳ *ఉపోద్ఘాతము:*
ఒంటరితనం రెండు విధాలు.
👉 భౌతికమైన ఒంటరితనం (కుటుంబ సభ్యుల ద్వారా పోవును.)
👉 అంతరంగ ఒంటరితనం స్నేహితుల ద్వారా పోవును.
⭕అన్ని బంధాల కంటే గొప్ప బంధం స్నేహ బంధం.
⭕ఇతర పదాలు – మైత్రి, సావాసం, చెలిమి, స్నేహం.
⭕ప్రాణము పెట్టువాడు మాత్రమే నిజస్నేహితుడు. ఉదా: (యేసు) ప్రాణము పెట్టిన యేసు.
⭕ ప్రాణం తీయువాడు కపట స్నేహితుడు ఉదా :(సాతాను) యూదా.
⭕దేవుడు మాత్రమే నిజ స్నేహితుడు. దేవుడు అబ్రహామునకు స్నేహితుడు. 2 దిన 20:5-7, యెషయ 41:8, యాకోబు 2:23.
⭕ఇద్దరు స్నేహితులు కలసి పనిచేస్తే కలిస్తే మంచి ఫలము కలుగు తుంది. ఒకరి కొకరు సాయంగా ఉండగలరు. ప్రసంగి 4:9 ఇద్దరి కష్టముచేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక ఒంటిగాడై యుండుటకంటె ఇద్దరు కూడి యుండుట మేలు..
⭕నిజస్నేహితుడు తగ్గింపు మనస్సు కలిగి యుండాలి: లూకా 14:8 నిన్నెవరైనను పెండ్లి విందుకు పిలిచినప్పుడు అగ్రపీఠము మీద కూర్చుండ వద్దు; ఒకవేళ నీకంటె ఘనుడు అతని చేత పిలువబడగా లూకా 14:9 నిన్నును అతనిని పిలిచినవాడు వచ్చి ఇతనికి చోటిమ్మని నీతో చెప్పును, అప్పుడు నీవు సిగ్గు పడి కడపటి చోటున కూర్చుండసాగుదువు. లూకా 14:10 అయితే నీవు పిలువబడి నప్పుడు, నిన్ను పిలిచినవాడు వచ్చిస్నేహి తుడా, పైచోటికి పొమ్మని నీతో చెప్పులాగున నీవు పోయి కడపటి చోటున కూర్చుండుము.
సామెతలు 16:7 ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగు నప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. యోహాను 15:15 ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను.
✳ *స్నేహం గురించి కొన్ని హెచ్చరికలు:*
👉 *1. స్నేహితులను జాగ్రత్తగా ఎంచుకోవాలి.* సామె 22:24- 25 కోపచిత్తునితో సహవాసము చేయకుము క్రోధము గలవానితో పరిచయము కలిగి యుండకుము 25 నీవు వాని మార్గములను అనుసరించి నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకొందువేమో.
👉 *2. చెడ్డ స్నేహం మనలను కూడా చెడగొడుతుంది.* 1కోరి 15:33 మోసపోకుడి. దుష్టసాంగత్యము మంచి నడవడిని చెరుపును. you.
👉 *౩. ప్రతిదానికి స్నేహితుల మీద ఆధారపడకూడదు.* సామె 25:17 మాటిమాటికి నీ పొరుగువాని యింటికి వెళ్లకుము.
👉 *4. స్నేహితులను విసిగించ కూడదు.* సామె 25:17 మాటిమాటికి నీ పొరుగువాని యింటికి వెళ్లకుము అతడు నీవలన విసికి నిన్ను ద్వేషించునేమో.
👉 *5. స్నేహితుల గురించి బయట చెడ్డగా మాట్లాడరాదు.* అది స్నేహాన్ని దెబ్బదీయును. సామె 16:28 .... కొండెగాడు మిత్రభేదము చేయును.
👉 *6. స్నేహితులకు నమ్మక ద్రోహం చేయరాదు.* అట్టివారు విరిగిన కాలు, విరిగిన పన్నుతో సమానం. సామె 25:19 ఉదా: యూదా ఇస్కారియోతు
👉 *7. స్నేహితుల మనస్సులకు బాధ కలిగించి “నవ్వులాటకు” అని చెప్పరాదు.* సామె 26:19 తన పొరుగువాని మోసపుచ్చి నేను నవ్వులాటకు చేసితినని పలుకువానితో సమానుడు.
✳ *నిజ స్నేహితుడైన యేసు ద్వారా కలుగు 10 మేలులు:*
1⃣. *నిజ స్నేహితుడైన యేసు మన మేలు కోరువాడుగా ఉన్నాడు:* సామె 27:6 మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును పగవాడు లెక్కలేని ముద్దులుపెట్టును.
2⃣. *నిజ స్నేహితుడైన యేసు మనలను సంతోష పరచువాడుగా ఉన్నాడు:* యోహాను ౩:29 నిలువబడి పెండ్లి కుమారుని స్వరము వినెడి స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును సామె 27:9 తైలమును అత్తరును హృదయమును సంతోష పరచునట్లు చెలికాని హృదయములో నుండి వచ్చు మధురమైన మాటలు హృదయమును సంతోష పరచును. (దేవుని మాటలు)
3⃣. *నిజ స్నేహితుడైన యేసు మనతో ముఖాముకిగా మాటలాడువాడుగా ఉన్నాడు:* దాపరికము లేనివాడు
ఉదా1 : నిర్గ 33:11 దేవుడు – మోషే ,
ఉదా2. దేవుడు – అబ్రహాము ఆదికాండం 18:17 అప్పుడు యెహోవానేను చేయబోవు కార్యము అబ్రాహామునకు దాచెదనా?
4⃣. *నిజ స్నేహితుడైన యేసు మనలను ప్రేమించువాడుగా ఉన్నాడు:* యోహాను 15:13 తన స్నేహితులకొరకు తన ప్రాణము పెట్టువానికంటె ఎక్కువైన ప్రేమగలవాడెవడును లేడు. సామె 17:17 నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును.
5⃣. *నిజ స్నేహితుడైన యేసు మనకు బుద్ధి (వివేకము) కలిగించువాడుగా ఉన్నాడు:* – సామె 27:17 ఇనుముచేత ఇనుము పదునగును అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును. ఆ వివేకముగల మాటవినువాడు స్నేహితుడు ఉదా1 : అబ్రహాము
ఉదా2: మోషే
ఉదా ౩ బాలుడైన సముయేలు
6⃣. *నిజ స్నేహితుడైన యేసు మన ప్రాణానికి దగ్గరగా ఉండువాడుగా ఉన్నాడు:* – సన్నిధిని సమయమును ఇచ్చువాడు (క్లోజ్ ఫ్రండ్ - ప్రాణ స్నేహితుడు-లోబడువాడు) సామె 18:24 బహుమంది చెలికాండ్రు గలవాడు నష్టపడును సహోదరుని కంటెను ఎక్కువగా హత్తియుండు స్నేహి తుడు కలడు.
ఉదా 1: యోనాతాను 1సమూ 18:1 దావీదు సౌలుతో మాటలాడుట చాలించినప్పుడు... యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను; యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతని ప్రేమించెను. 1సమూ 20:17
7⃣. *నిజ స్నేహితుడైన యేసు నమ్మకత్వం కలిగినవాడుగా ఉన్నాడు:*
ఉదా: దేవుడు – అబ్రహాము యాకోబు 2:23 (అబ్రహాము దేవుని నమ్మెను - దేవుని స్నేహితుడుగా మారెను.) ఉదా: దేవుడు మాత్రమే నమ్మదగినవాడు (విశ్వాస్యత) – మనుష్యులు నమ్మదగనివారు 2 తిమో 2:13 ఈ లోక స్నేహితులు నమ్మదగిన వారు కారు.
8⃣. *నిజ స్నేహితుడైన యేసు పరిచర్య (సహాయం) చేయువాడుగా ఉన్నాడు:* యోహాను 15:14 నేను మీకాజ్ఞాపించు వాటిని చేసిన యెడల, మీరు నా స్నేహితులై యుందురు. ఉదా1 : అర్దరాత్రి స్నేహితుడు లూకా 11:8
9⃣. *నిజ స్నేహితుడైన యేసు మన కొరకు ప్రార్ధించువాడుగా ఉన్నాడు:*
ఉదా1 యేసు సమస్త మానవాళి కొరకు గెత్సెమనే వనంలో ప్రార్ధన చేశాడు.
ఉదా2 యోబు 42:10 మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరల అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటె రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను.
🔟. *నిజ స్నేహితుడైన యేసు తన రక్తంతో సంఘాన్ని స్థాపించి తన సంఘ సహవాసానికి మనలను పిలుస్తూ ఉన్నాడు:* కీర్త 119:63 నీయందు భయభక్తులు గలవారందరికిని నీ ఉపదేశములను అనుసరించు వారికిని నేను *చెలికాడను.* సామె 13:20 *జ్ఞానుల సహవాసము* చేయువాడు జ్ఞానము గలవాడగును.
✳ *ముగింపు:* సిలువలో మన కొరకు ప్రాణం పెట్టిన *యేసు మాత్రమే మన నిజమైన స్నేహితుడు.*
నిజస్నేహితుడైన యేసుతో ఎల్లవేళల ముందుకు సాగిపోవడానికి ప్రభువు కృప మనకు నిత్యం తోడుగా ఉండునుగాక! ఆమెన్!
====================
*అలసిన వానికి ఊరడించు మాటలు*
🍞🍞🍞🍞🍞🍞🍞🍞🍞
*సహోదరుడు భక్త సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన*
*అనుదిన ధ్యానములు*
🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇
*" .. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును" (హెబ్రీ. 6:14)*
యాకోబు బేతేలునకు ప్రయాణమై పోవుచుండగా, దేవుడు అతనికి ప్రత్యక్షమై అతనితో ఈలాగున చెప్పెను, "నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్లుము, నీకు మేలు చేసెదను" (ఆదికాండము 32:9). దేవుని స్వరము వినుట ఎంత గొప్ప ధన్యత! ఎప్పుడైతే యాకోబు తన ఇంటిలో నుండి అన్యదేవతలను తీసిపారవేసెనో దానిని బట్టి యెహోవా అతనియందు ఆనందించి, అతనిని ప్రేమించ గలిగెను మరియు అతనితో మాటలాడుటకు ఇష్టపడెను. ఇప్పుడైతే దేవుడు యాకోబునకు ఎన్నో సంవత్సరముల క్రిందట చేసిన వాగ్దానములను నెరవేర్చెను, సంపూర్ణముగా ఆశీర్వదించెను. "ఇదిగో నేను నీకు తోడైయుండి, నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు మరల నిన్ను రప్పించెదను, నేను నీతో చెప్పినది నెరవేర్చువరకు నిన్ను విడువను" (ఆదికాం. 28:15).
మనలో చాల మంది ఆయా సందర్భములలో అనగా క్రొత్త సంవత్సర దినమున, పుట్టిన దినమున లేక ఏదైనను ప్రత్యేక సందర్భములో దేవుని నుండి వాగ్దానములను పొందుదుము. కానీ బహుశా నీ జీవితములో దేవుడు చేసిన వాగ్దానము నెరవేర్చబడలేదను అనుభూతిని నీవు కలిగి యుండవచ్చును. నిజమే ఒక వేళ నీ జీవితము యొక్క ఆరంభములో యాకోబు జీవితము ఎలా ఉండెనో ఆలాగున ఉన్న యెడల ఆయన నీతో చేసిన వాగ్దానమును నెరవేర్చలేడు .. మొదటిగా , నీలో ఏదైనను విగ్రహములు దాగి ఉండవచ్చును. రెండవదిగా, నీవు ఇంకను బేతేలునకు (దేవునికి) చాల దూరముగా ఉండి ఉండ వచ్చును. ఒక వేళ నీవు ఇప్పటికే దేవుని యొద్ద నుండి అనేక ఆశీర్వాదములను పొందియున్న యెడల వాటితో సంతృప్తి చెందవద్దు దేవుడు ఇంకను అనేక ఆశీర్వాదములను నీకు ఇవ్వగోరుచున్నాడు. అయితే యాకోబు ఇప్పటికే అనేక ఆశీర్వాదములను పొందియున్నప్పటికిని దేవుడు యాకోబునకు ఇంకను అనేక ఆశీర్వాదములు ఇవ్వగోరెను. దేవుడు యాకోబును ఇశ్రాయేలు, రాకుమారుడని పిలిచెను. కానీ దేవుడు యాకోబును ఇరువది సంవత్సరములు పరిశీలించెను. అతని ప్రవర్తనను బట్టి ఇంకను అతడు భిక్షగానివలె దేవుని ఎదుట కనబడెను. కనుక దేవుడు యాకోబుతో నీవు ఇంకను ఏ మాత్రము భిక్షగానిగా గాక రాకుమారునిగా జీవించ వలెనని మరొకసారి మాటలాడుచు వచ్చెను. ఇప్పటి నుండి యాకోబు ఒక రాకుమారునివలె జీవించుటకు నేర్చుకొనెను.
ఎప్పుడైతే యాకోబు తన ఇంటిలో నుండి అన్యదేవతలను తీసిపారవేసి బేతేలునకు ప్రయాణమయ్యెనో అప్పుడు అతడు రాకుమారుని వలె జీవించవలెనని నేర్చుకొనుట ఆరంభించెనని రుజువైనది. దేవుడు అతనితో ఈలాగున చెప్పెను. నీవు రాకుమారుడవు.. రాజులు నీ గర్భవాసమును పుట్టెదరు (ఆదికాం. 35:11,12) అప్పటి నుండి యాకోబు దేవుని కుమారునిగా, ప్రవక్తగా, మరియు స్నేహితునిగా ఉండు అనుభవములోనికి వచ్చెను. అందుచేతనే అతడు చనిపోకముందు తన కుమారులందరిని పిలచి దేవుని ఆశీర్వాదములతో ఆశీర్వదించెను. మరియు దేవుడు, "నేను సర్వశక్తిగల దేవుడను ఫలించి అభివృద్ధి పొందుము"అని యాకోబుతో చెప్పెను. నీవు కూడా రాజకుమారుడవుగానై దేవుని శక్తిని నీ జీవితములో అనుభవించగలవు. నీవు ఎన్నటెన్నటికిని అధైర్యపడువాడవుగా ఉండవు.
🙏🏼Praise the LORD.🙏🏼
Subscribe to:
Comments (Atom)
✝ *నిజమైన స్నేహితుడు*👬
_(యోహా 15:14 నేను మీ కాజ్ఞాపించువాటిని చేసిన యెడల, మీరు *నా స్నేహితులై* యుందురు.)_ ✳ *ఉపోద్ఘాతము:* ఒంటరితనం రెండు విధాలు. 👉 భౌతికమైన...
-
_(యోహా 15:14 నేను మీ కాజ్ఞాపించువాటిని చేసిన యెడల, మీరు *నా స్నేహితులై* యుందురు.)_ ✳ *ఉపోద్ఘాతము:* ఒంటరితనం రెండు విధాలు. 👉 భౌతికమైన...
-
సహోదరుడు భక్త సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు "యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్థ్యభాగము యాకోబే "...
-
🍞🍞🍞🍞🍞🍞🍞🍞🍞 *సహోదరుడు భక్త సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన* *అనుదిన ధ్యానములు* 🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇 *" .. నిశ్చయమ...