Saturday, July 31, 2021

అలసిన వానికి ఊరడించు మాటలు

సహోదరుడు భక్త సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు "యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్థ్యభాగము యాకోబే " (ద్వితీయో. 32:9) మనము ప్రకాశించు ముత్యముతో పోల్చబడితిమి. "ఒక వర్తకుడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని, పోయి తనకు కలిగిన దంతయు అమ్మి దాని కొనును"(మత్తయి 13: 45,46). సామాన్యముగా ముత్యములు వాటి అందమునకు, ప్రకాశమునకు పేరు గాంచినవి. ఈ లోకములో మనము బలహీనులము, బుద్ధిహీనులము అయినను దేవుని దృష్టిలో మనము సుందరముగా, విలువైన వారముగా, ప్రశస్తమైన వారముగా నుందుమను విషయమును నమ్మవలెను. ఒక బిడ్డ అంద విహీనముగా, మూర్ఖముగా, మురికిగా ఉన్నప్పటికిని ధైర్యముగా తన తల్లి యొద్దకు పోవును. ఆ బిడ్డ ఆమెకు ఎంతో ప్రశస్తమైనది. శత్రువుని ఎదిరించుటకు దేవుడు మన ఆత్మీయ అందమును కోరుచున్నాడు. మనము రక్షింపబడక మునుపు మురికి గుడ్డపేలికలవలె ఉంటిమి. ఆ మురికి గుడ్డ పేలికయే ఇప్పుడు ప్రకాశించు ముత్యముగా నైనది. తిరిగి, మనము నిరంతరమును నిలుచు స్వాస్థ్యముతో పోల్చబడితిమి. " యెహోవా వంతు ఆయన జనమే. ఆయన స్వాస్థ్య భాగము యాకోబే" (ద్వితీయో. 32:9) ప్రపంచములోని గొప్ప వ్యక్తులు తమ లోకసంబంధమైన స్వాస్థ్యమును బట్టి గర్వించుదురు. మన ప్రభువు మనలను తెలియని వారినిగా స్వీకరించడు. ఆయన మనలను తన నిత్య విలువ కలిగిన నిత్యస్వాస్థ్యముగా స్వీకరించును. అందుచేతనే మన అన్ని అవసరతల నిమిత్తము, భారముల నిమిత్తము ఆయనకు ప్రార్ధించుటకు మనకు ధైర్యము నిచ్చును. మనము నష్టపోవుట ఆయన కిష్టములేదు. ఆయన గతించి పోవు భూమి, ఆకాశముల విషయములో, దూతల విషయములో వహించు శ్రద్ధకంటెను, మన విషయమై అధిక శ్రద్ధ వహించును. అవి దేవుని నిత్యస్వాస్థ్యముగా ఎన్నిక చేయబడవు. అవి వ్యర్ధమైనవిగా ఎంచబడును. కానీ విశ్వాసులు దేవుని నిత్యస్వాస్థ్యము. ఈ ఉపమానములన్నియు మనము దేవుని యొద్ద హక్కుతో, ధైర్యముతో ప్రార్ధించుటకు తోడ్పడును. ఎవరైతే తిరిగి జన్మించలేదో వారు ఆయన కనికరము కొరకు ప్రార్ధించవలెను. దేవుడు కృపగలవాడు, ఆయన ప్రతి ఒక్కరిని ఆహ్వానించి, తృప్తి పరచును. "అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్య కరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయము లను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తయిన ప్రజలునై యున్నారు" (1 పేతురు 2:9) మనము ఏర్పరచబడిన వంశము, అనగా మన ఊహకు మించిన ఉన్నతమైన ఉద్దేశ్యముతో మనము దేవుని చేత ఏర్పరచబడితిమి. ఆకాశములో నక్షత్రములు అందముగా, ప్రకాశమానముగా నుండును గాని, అవి విశ్వాసులవలె దేవుని గొప్పతనమును, మహిమను చూపించలేవు. దేవుని నానావిధములైన జ్ఞానము, మహిమ ఆయన ఏర్పరచుకొనిన వంశము ద్వారానే వెల్లడి యగును. మనము రాజులైన యాజక సమూహము. మనము యాజకులము, రాజులము. రాజులుగా, యాజకులుగా విశ్వాసముతో ఆయన సన్నిధిలోనికి వెళ్ళు ధైర్యమును కలిగి యున్నాము. ఆత్మీయ ప్రజలుగా ఆయన మహిమను కనబరచు అద్భుతమగు అవకాశము మనకు గలదు. చిన్న విషయములలో కూడా దేవుడు తన కృపను కనబరచును. చిన్న విషయముల కొరకు కూడా ఆయనను స్తుతించవలెనని ఆయన కోరుచున్నాడు. Please share 🙏🏼Praise the LORD.🙏🏼

✝ *నిజమైన స్నేహితుడు*👬

_(యోహా 15:14 నేను మీ కాజ్ఞాపించువాటిని చేసిన యెడల, మీరు *నా స్నేహితులై* యుందురు.)_ ✳ *ఉపోద్ఘాతము:* ఒంటరితనం రెండు విధాలు. 👉 భౌతికమైన...