Sunday, August 1, 2021

*అలసిన వానికి ఊరడించు మాటలు*

🍞🍞🍞🍞🍞🍞🍞🍞🍞 *సహోదరుడు భక్త సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన* *అనుదిన ధ్యానములు* 🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇 *" .. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును" (హెబ్రీ. 6:14)* యాకోబు బేతేలునకు ప్రయాణమై పోవుచుండగా, దేవుడు అతనికి ప్రత్యక్షమై అతనితో ఈలాగున చెప్పెను, "నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్లుము, నీకు మేలు చేసెదను" (ఆదికాండము 32:9). దేవుని స్వరము వినుట ఎంత గొప్ప ధన్యత! ఎప్పుడైతే యాకోబు తన ఇంటిలో నుండి అన్యదేవతలను తీసిపారవేసెనో దానిని బట్టి యెహోవా అతనియందు ఆనందించి, అతనిని ప్రేమించ గలిగెను మరియు అతనితో మాటలాడుటకు ఇష్టపడెను. ఇప్పుడైతే దేవుడు యాకోబునకు ఎన్నో సంవత్సరముల క్రిందట చేసిన వాగ్దానములను నెరవేర్చెను, సంపూర్ణముగా ఆశీర్వదించెను. "ఇదిగో నేను నీకు తోడైయుండి, నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు మరల నిన్ను రప్పించెదను, నేను నీతో చెప్పినది నెరవేర్చువరకు నిన్ను విడువను" (ఆదికాం. 28:15). మనలో చాల మంది ఆయా సందర్భములలో అనగా క్రొత్త సంవత్సర దినమున, పుట్టిన దినమున లేక ఏదైనను ప్రత్యేక సందర్భములో దేవుని నుండి వాగ్దానములను పొందుదుము. కానీ బహుశా నీ జీవితములో దేవుడు చేసిన వాగ్దానము నెరవేర్చబడలేదను అనుభూతిని నీవు కలిగి యుండవచ్చును. నిజమే ఒక వేళ నీ జీవితము యొక్క ఆరంభములో యాకోబు జీవితము ఎలా ఉండెనో ఆలాగున ఉన్న యెడల ఆయన నీతో చేసిన వాగ్దానమును నెరవేర్చలేడు .. మొదటిగా , నీలో ఏదైనను విగ్రహములు దాగి ఉండవచ్చును. రెండవదిగా, నీవు ఇంకను బేతేలునకు (దేవునికి) చాల దూరముగా ఉండి ఉండ వచ్చును. ఒక వేళ నీవు ఇప్పటికే దేవుని యొద్ద నుండి అనేక ఆశీర్వాదములను పొందియున్న యెడల వాటితో సంతృప్తి చెందవద్దు దేవుడు ఇంకను అనేక ఆశీర్వాదములను నీకు ఇవ్వగోరుచున్నాడు. అయితే యాకోబు ఇప్పటికే అనేక ఆశీర్వాదములను పొందియున్నప్పటికిని దేవుడు యాకోబునకు ఇంకను అనేక ఆశీర్వాదములు ఇవ్వగోరెను. దేవుడు యాకోబును ఇశ్రాయేలు, రాకుమారుడని పిలిచెను. కానీ దేవుడు యాకోబును ఇరువది సంవత్సరములు పరిశీలించెను. అతని ప్రవర్తనను బట్టి ఇంకను అతడు భిక్షగానివలె దేవుని ఎదుట కనబడెను. కనుక దేవుడు యాకోబుతో నీవు ఇంకను ఏ మాత్రము భిక్షగానిగా గాక రాకుమారునిగా జీవించ వలెనని మరొకసారి మాటలాడుచు వచ్చెను. ఇప్పటి నుండి యాకోబు ఒక రాకుమారునివలె జీవించుటకు నేర్చుకొనెను. ఎప్పుడైతే యాకోబు తన ఇంటిలో నుండి అన్యదేవతలను తీసిపారవేసి బేతేలునకు ప్రయాణమయ్యెనో అప్పుడు అతడు రాకుమారుని వలె జీవించవలెనని నేర్చుకొనుట ఆరంభించెనని రుజువైనది. దేవుడు అతనితో ఈలాగున చెప్పెను. నీవు రాకుమారుడవు.. రాజులు నీ గర్భవాసమును పుట్టెదరు (ఆదికాం. 35:11,12) అప్పటి నుండి యాకోబు దేవుని కుమారునిగా, ప్రవక్తగా, మరియు స్నేహితునిగా ఉండు అనుభవములోనికి వచ్చెను. అందుచేతనే అతడు చనిపోకముందు తన కుమారులందరిని పిలచి దేవుని ఆశీర్వాదములతో ఆశీర్వదించెను. మరియు దేవుడు, "నేను సర్వశక్తిగల దేవుడను ఫలించి అభివృద్ధి పొందుము"అని యాకోబుతో చెప్పెను. నీవు కూడా రాజకుమారుడవుగానై దేవుని శక్తిని నీ జీవితములో అనుభవించగలవు. నీవు ఎన్నటెన్నటికిని అధైర్యపడువాడవుగా ఉండవు. 🙏🏼Praise the LORD.🙏🏼

No comments:

✝ *నిజమైన స్నేహితుడు*👬

_(యోహా 15:14 నేను మీ కాజ్ఞాపించువాటిని చేసిన యెడల, మీరు *నా స్నేహితులై* యుందురు.)_ ✳ *ఉపోద్ఘాతము:* ఒంటరితనం రెండు విధాలు. 👉 భౌతికమైన...